నిందితులను కఠినంగా శిక్షిస్తాం: హోంమంత్రి

Mahmood Ali
Mahmood Ali

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి ఉదంతంపై తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ఈ రోజు ఆయన శంషాబాద్‌లో నివాసముండే ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె హత్య బాధకరమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా రెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. యువ వైద్యురాలు ప్రియాంక దారుణ హత్యపై విచారం వ్యక్తం చేశారు. నేరాలు నియంత్రిండంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారన్నారు. అయితే యువతి తొలుత 100కు కాకుండా ఆమె సోదరికి ఫోన్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 100 డయల్‌ చేస్తే పోలీసులు కాపాడేవారని తెలిపారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా 100కు ఫోన్‌ చేయాలని హోమంత్రి విజ్ఞప్తి చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/