అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్‌కి మహేష్‌ మైనపుబొమ్మ

mahesh wax statue
mahesh wax statue


ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ పలువురి సెలబ్రెటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం సింగపూర్‌లోని మ్యూజియంలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది హీరోలలో ప్రభాస్‌ తర్వాత మహేష్‌కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. మహేష్‌ అభిమానుల సందర్శనార్ధం మార్చి 25 మైనపు వ్యాక్స్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌కి తీసుకురాబోతున్నారు. మహేష్‌ మల్టీ ప్లెక్స్‌ సంస్థ ఏఎంబి సినిమాస్‌లో ఈ విగ్రహాన్ని ఒక్క రోజు ఉంచనున్నారు. తర్వాత సింగపూర్‌ తరలించి టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉంచనున్నారు.