త్రివిక్రమ్ మూవీ అప్డేట్ ను పోస్ట్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అతడు , ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాలు వీరిద్దరి కలయికలో వచ్చి అభిమానులను , ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని గతంలోనే ప్రకటించారు. ఆ తర్వాత ఈ కాంబో వార్త ఏది రాలేదు. ఈ తరుణంలో ఈరోజు మహేష్ ఈ మూవీ అప్డేట్ తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్, నిర్మాత నాగవంశీతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.

మహేష్ ​బాబు ప్రస్తుతం దుబాయ్​లో ఫ్యామిలీతో వెకేషన్​లో ఉన్నారు. అయినా సరే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ తెలిపి ఆనందం నింపారు. ఇక మహేష్ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే..గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో పాన్ మూవీస్ ఉండడం తో సర్కారు వారి పాట ను ఏప్రిల్ 01 న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుండగా..మైత్రీమూవీమేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.