తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్
తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ మరో చిన్నారికి ప్రాణం పోసి దేవుడయ్యాడు మహేష్. సూపర్ స్టార్ మహేష్ కు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇంట్లో ఒక్కరు చనిపోతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది ఒకే ఏడాది తల్లి , తండ్రి , సోదరుడు ఇలా ముగ్గురు చనిపోతే అంతకన్నా కష్టం మరోటి ఉండదు. ప్రస్తుతం మహేష్ అలాంటి కష్టం లోనే ఉన్నాడు. ముందుగా సోదరుడు రమేష్ బాబు జనవరిలో చనిపోయాడు. సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరా దేవి చనిపోయింది. ఇక ఇప్పుడు తండ్రి కృష్ణ చనిపోయాడు. ఇలా ముగ్గుర్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఇంత బాధలో కూడా మరో చిన్నారికి ప్రాణం పోసి దేవుడయ్యాడు.
సూపర్ స్టార్ మహేష్.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో సైతం సూపర్ స్టారే. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారిని పునర్ జన్మ అందిస్తున్నాడు. ఇప్పటికే వందల మందికి ఆపరేషన్ చేయించిన మహేష్..తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి గుండెకు ప్రాణం పోశారు. ఆ చిన్నారి కుటుంబానికి దేవుడిగా మారిపోయారు. కృష్ణ మరణం అంచున ఆసుపత్రిలో ఉన్నా కూడా.. సేవ చేయడం మాత్రం ఆపలేదు ప్రిన్స్ మహేశ్ బాబు. ఓ పక్క తండ్రిని దగ్గరుండి చూసుకుంటూనే… తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి గుండెకు ప్రాణం పోశారు. మోక్షిత్ సాయి అనే చిన్నోడి హృదయ సమస్య గురించి తెలుసుకున్న మహేశ్.. ఆంధ్ర ఆస్పత్రిలో ఆ చిన్నారికి గుండె ఆపరేషన్‌కు కూడా ఏర్పాట్లు చేశారు. ఓ పక్క తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతూనే.. మరో పక్క.. ఆ చిన్నారికి ప్రాణం పోయే ప్రయత్నాన్ని చేశారు. తన తండ్రిని దక్కించుకోలేక పోయినా.. ఆ చిన్నారికి నూరేళ్ల ఆయుష్షు పోశారు. ఆ కుటుంబానికి దేవుడయ్యారు.