స్పెయిన్ లో మహేష్ కు సర్జరీ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగబోతుందనే వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సర్జరీ పూర్తి అయ్యిందట. స్పెయిన్ లో మహేష్ మోకాలి సర్జరీ పూర్తి అయ్యిందట. మహేష్ అక్కడి నుంచి దుబాయ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో మోకాలికి చిన్న గాయం అవడంతో.. శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సోమవారం స్పెయిన్ కు వెళ్లి సక్సెస్ ఫుల్ గా మోకాలికి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ దుబాయ్ వెళ్లి రెస్ట్ తీసుకోనున్నారు.

మహేష్ బాబు ఈసారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దుబాయ్ లో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే మహేష్ సతీమణి నమ్రత మహేష్ వెంట ఉండగా.. డిసెంబర్ 24న పిల్లలు గౌతమ్ – సితార దుబాయ్ కు వెళ్తారని తెలుస్తోంది.