మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట

బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలు

Mahesh Babu
Mahesh Babu

హైదరాబాద్‌: ప్రముఖ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుతో ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫొటో షూట్ లో తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో ఈ ఫొటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది. దీంతో, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. కాగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోటోలు దిగవచ్చు అంటూ ఆన్‌లైన్‌ లో పోస్ట్‌ చేయడంతో మహేష్‌బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనుకున్న దాని కంటే భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఫొటోషూట్‌ కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసినట్టు సమచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/