బ్యాక్ టు ఒరిజినల్ ఫ్రెష్

Mahesh Babu
Mahesh Babu

బ్యాక్ టు ఒరిజినల్ ఫ్రెష్

ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను సక్సెస్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దీని తర్వాతే తన 25వ సినిమా కావడంతో ఫాన్స్ కూడా మాంచి కిక్ మీదున్నారు. కాకపోతే షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభించడంతో విడుదల వచ్చే ఏడాది ఉండబోతోంది. ఆ మేరకు ఏప్రిల్ 5 డేట్ కూడా చెప్పేసారు కాబట్టి ఇక ఆ విషయంలో ఎలాంటి సస్పెన్స్ కు అవకాశం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషం అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా కనిపించేది అన్నింటికన్నా ముఖ్యమైనది. ఇటీవలే డెహ్రాడూన్ లో 24 రోజుల పాటు కీలక తారాగణం మొత్తం పాల్గొనగా షూట్ చేసింది ఈ సన్నివేశాలే. మామూలుగానే వయసుతో సంబంధం లేకుండా యంగ్ గా కనిపించే మహేష్ ని ఇంకా యూత్ ఫుల్ గా చూపించడం కోసం వెరైటీగా గెడ్డం మీసం పెంచేలా చేసి దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన ప్రయత్నం మంచి ఫలితం ఇచ్చింది కాకపోతే ఇది కేవలం సినిమాకు సంబంధించి ఒక ఎపిసోడ్ కు మాత్రమే కాబట్టి ఆ లుక్ అంతటా ఉండదు. ఆ పార్ట్ పూర్తయిపోయింది కాబట్టి మహేష్ మళ్ళి తన రెగ్యులర్ లుక్ లోకి వచ్చేసాడు. పూర్తిగా తీసేయడం అని కాదు కానీ లుక్ పరంగా చాలా మార్పు కనిపించేలా మొత్తం ట్రిమ్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ లో ఒక షో రూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఫ్రెష్ గా కనిపించాడు మహేష్