మరో వ్యాపారం చేయనున్న మహేశ్‌ బాబు!

Mahesh Babu
Mahesh Babu

హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మహేశ్ బాబు త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. తమ దుస్తులను http://www.spoyl.in/mahesh-babu లో ఆవిష్కరిస్తామని మహేశ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని మహేశ్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఇంకో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఈ వెబ్ సైటలోకి లాగిన్ కావడం ద్వారా ప్రిన్స్ మహేశ్ బాబును అభిమానులు కలుసుకోవచ్చని తెలుస్తోంది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/