రానాను చూస్తుంటే గర్వంగా ఉంది: మహేష్‌

MAHESH BABU
MAHESH BABU

రానాను చూస్తుంటే గర్వంగా ఉంది: మహేష్‌

నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన కేరాఫ్‌ కంచెరపాలెం విడుదల కాకముందే ప్రివ్యూ షోల ద్వారా సినీ ప్రముఖల హృదయాలను గెలుచుకున్న ఈచిత్రం., విడుదల తర్వాత కూడ ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.. ఇంత మంచి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న విషయం తెలిసిందే..
కాగా రానాపై ఈచిత్రం బృందంపై సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రశంసల జట్లు కురిపించారు..ఈచిత్రం చూసిన తర్వాత మహేష్‌ తన స్పందన ను ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.. కేరాఫ్‌ కంచెరపాలెం చిత్రం నిజంగా దర్శకుడి చిత్రమన్నారు. ఈచిత్రంలోని పాత్రలను దర్శకుడు అద్భుతంగా రాశాడని, ఇక క్లైమాక్స్‌ అయితే ఈసినిమాకు గుండెకాయవంటిదని అన్నారు. మొదటి సినిమానే ఇంత అత్యద్భుతంగా తెరకెక్కించిన వెంకటేష్‌ మహాకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. తనకు ఈచిత్రం బాగా నచ్చిందని, ఇంతటి మంచి నైపుణ్యం ఉన్న యంగ్‌ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న రానాను చూస్తుంటే గర్వంగా ఉందంటూ మహేష్‌ పోస్ట్‌చేయటం విశేషం..కాగా ఈచిత్రానికి స్వీకర్‌ అగస్తి సంగీతం అందించారు..