ముంబయి విమానాశ్రయంలో ప్లాస్టిక్‌ పై నిషేధం

mumbai-airport
mumbai-airport

ముంబయి: ముంబయి విమానాశ్రయంలో ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం విధించారు. ఈరోజు నుండి ముంబయి ఎయిర్‌పోర్టు ప్లాస్టిక్‌ రహిత విమానాశ్రయంగా మారనున్నది. ఈ విమానాశ్రయాన్నినిర్వహిస్తున్న జివికె సంస్థ ఇకపై స్టీల్‌తో చేసిన స్ట్రాలు, ప్లేట్లు తదితర వస్తువులను, వస్త్రాలతో తయారు చేసిన సంచీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానాశ్రయంలో సింగిల్‌ యూజ్‌ స్లాస్టిక్‌పై పూర్తి నిషేధం విధించామని ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఎఐఎల్‌) అధికారి ఒకరు చెప్పారు. థర్మోకోల్‌, పెట్‌ బాటిల్స్‌, వాడి పారవేసే ఫుడ్‌ ప్యాకేజ్‌ సామగ్రి మొదలైన వాటిపై నిషేధం విధించినట్లు ఆ అధికారి తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/