మార్చి 29న ‘మహర్షి’ తొలి పాట!

maharshi
maharshi


హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ ఆరంభం కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో మహేశ్‌, ‘అల్లరి’ నరేశ్‌, పూజా హెగ్డే సముద్రతీరంలో నిలబడి కెరటాలను చూస్తున్నట్లుగా ఉన్నారు. మార్చి 29న ఉదయం మహర్షి సినిమాలో తొలి పాట విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. మే9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజా తెర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/