మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో షరతులతో కూడిన మద్యం అమ్మకాలకు అనుమతి

Wine Shops
Wine Shops

ముంబయి: మందుబాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. లాక్‌ డౌన్ కార‌ణంగా గడచిన 30 రోజులుగా మ‌ద్యం దొర్క‌క మద్యం ప్రియులు విలవిల్లాడుతున్నారు. అయితే రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేయనున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తినిస్తూ ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేష‌న్‌ ను వెలువరిస్తామని అయితే, ప్రభుత్వం విధించే ప్రత్యేకమైన గైడ్‌ లైన్స్‌ ఆధారంగా అమ్మకాలకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరని, రూల్స్ అన్నీ పాటిస్తేనే పర్మిషన్ ఉంటుందని, నిబంధనలను మీరినట్టు తేలితే, వెంటనే దుకాణం లైసెన్స్ ను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

తాజా ఏపి బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/