మహారాష్ట్ర ను వణికిస్తున్న ఓమిక్రాన్

ఓమిక్రాన్ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. రోజు రోజుకు ఇక్కడ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలే కాదు పొరుగు రాష్ట్రాల వారు సైతం భయపడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర లో మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 20 కి చేరింది.

ఈ రెండు కేసులతో దేశంలో మొత్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. ఆదివారం ఏపీ, కేరళ, కర్ణాటక, ఛండీగడ్ లతో కొత్తగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ లో 9 కేసులు నమోదయ్యాయి. గుజరాత్, కర్ణాటకల్లో 03 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 2 కేసులు, ఏపీ, కేరళ, ఛండీగడ్ లలో ఒక్కో కేసు నమోదైంది.

ఇక బ్రిటన్ లో మాత్రం ఓమిక్రాన్ వణికిస్తోంది. తాజాగా.. బ్రిటన్​లో ఓ వ్యక్తి ఒమిక్రాన్​​తో మరణించారన్న వార్త కలకలం సృష్టించింది. అయితే.. అదే బ్రిటన్​లో ఒక్క ఒమిక్రాన్​తోనే 75వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం అంచనా వేయడం అత్యంత ఆందోళనకర విషయం. ఒమిక్రాన్​ నేపథ్యంలో బ్రిటన్​లో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. మరిన్ని చర్యలు తీసుకోకపోతే.. వచ్చే ఏడాది ఏప్రిల్​ నాటికి ఒమిక్రాన్​తో 25వేల నుంచి 75వేల మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ మోడెలింగ్​ అధ్యయనం పేర్కొంది.