మహారాష్ట్రలో 13.7 శాతం పోలింగ్‌

polling in maharashtra
polling in maharashtra


నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని ఏడు నియోజకవర్గాల్లో 11 నుంచి 13 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొదటి దశ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్నది. నాగ్‌పూర్‌లోని జిల్లా ఎన్నికల అధికారి ప్రకారం మొదటి నాలుగు గంటల్లో 17.56 శాతం ఓటింగ్‌ జరిగింది. మావోయిస్టుల ప్రాంతమైన గడ్చిరోలి-చిమూర్‌ నియోజకవర్గంలో 18.01 శాతంగా ఉంది.
వార్ధాలో ఉదయం 11 గంటలకు 15.76 శాతం, భండారా-గోండియాలో12.2 శాతం, యావత్మల్‌ వాషిమ్‌ 12.06 శాతం, చంద్రపూర్‌ 10.86 శాతం, రామ్టెక్‌లో 9.82 శాతం పోలింగ్‌ జరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/