ఓ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం

పౌరసత్వ బిల్లుతో ఉద్యోగం చేయలేనని రాజీనామా చేసిన ఐపీఎస్‌

abdul rehman ips
abdul rehman ips

ముంబయి: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐపీఎస్‌ అధికారి అబ్డుల్‌ రహమన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు పూర్తిగా మత తత్వ పూరితమైనదని, అది రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి పౌరసత్వ సవరణ బిల్లు 2019 పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన తెలిపారు. పౌరుల హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉన్న ఈ బిల్లును నేనే ఖండిస్తున్నానని అందుకే నా సర్వీసును వదిలేస్తున్నా. రేపటి నుంచి విధులకు హాజరుకాను అంటూ ట్విట్టర్‌లో తన రాజీనామా లేఖను పోస్ట్‌ చేశారు. ఇంకా భారత లౌకికవాద భావనకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/