నేడు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ

ముంబయి: మహారాష్ట్ర సిఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసినా.. కేబినెట్ కూర్పు మాత్రం చాలా ఆలస్యమైంది. నేడు మధ్యాహ్నం లోపు కేబినెట్ విస్తరణ జరగనుంది. తొలి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందరి చూపూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వైపే ఉంది. ఎన్సీపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి 15, శివసేన నుంచి 14 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. మొత్తం 40 మంది కేబినెట్లో ఉండనున్నారు. మధ్యాహ్నాం ఒంటిగంటకు ముంబయి లోని విధాన సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు పార్టీల నేతలు తీవ్ర చర్చలు జరిపారు. కాగా డిప్యూటీ సీఎంల రేసులో అజిత్ పవార్, జయంత్ పాటిల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, కేసీ పడ్వి, విజయ్ వాడేట్టివర్, అమిత్ దేశ్‌ముఖ్, సునీల్ కేదార్, యాషోమతి, వర్ష గైక్వాడ్, అస్లాం షేక్, సతేజ్ పాటిల్, విశ్వజీత్ కదమ్, యశోమతి ఠాకూర్లకు చోటు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/