మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ..18 ప్రమాణ స్వీకారం

,

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కేబినెట్‌ విస్తరణ జరిగింది. 18 మంది నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. బీజేపీకి నుంచి 9, శివసేన నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ పాటిల్, రవీందర్ చౌహన్, మంగళ్ ప్రభాత్, విజయ్ కుమార్, అతుల్ సవే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక శివసేన నుంచి దాదా బహుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, అబ్దుల్ సత్తర్, ఉదయ్ సమంత్, గులాబ్ రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, సందీపన్, తానాజీ సవంత్ మంత్రలుగా ప్రమాణం చేశారు.

కాగా జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎంగా..ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ ఏక్​నాథ్ శిందే, ఫడణవీస్ లక్ష్యంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు చర్యలు తీసుకుంది.