కరోనా కేసుల్లో చైనాను దాటేసిన మహారాష్ట్ర!

ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు

కరోనా కేసుల్లో చైనాను దాటేసిన మహారాష్ట్ర!
maharashtra-corona cases

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 3,007 కొత్త కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్య విషయంలో చైనాను దాటేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 85,975కి చేరుకోగా, 3 వేల మందికి పైగా మరణించారు. చైనాలో అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకూ 83,036 కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇక దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. మహారాష్ట్ర తరువాత కేసుల విషయంలో తమిళనాడు, ఢిల్లీ ముందు నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతానికి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/