మహరాష్ట్ర, హరియాణాలో ఓట్ల లెక్కింపు

మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బిజెపి

vote-counting
vote-counting

ముంబయి:అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అధికార బిజెపి , మరో ఐదేళ్లూ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా బిజెపి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై లేదని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు ముందుగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, హరియాణాలో మాత్రం ఆ పార్టీ కాంగ్రెస్, జేజేపీ, ఐఎస్ఎల్డీ కూటమిల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

ఇక, 288 స్థానాలున్న మహారాష్ట్రలో 174 చోట్ల తొలి రౌండ్ కౌంటింగ్ ముగియగా, బిజెపి , శివసేన కూటమి 108 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 48 స్థానాల్లో ఇతరులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక హరియాణా విషయానికి వస్తే, 90 స్థానాలుండగా, 50 చోట్ల తొలి రౌండ్ పూర్తయింది. బిజెపి 26 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, ఐఎస్ఎల్డీ కూటమి ఒక్క చోట, జేజేపీ 2 చోట్ల, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/