రేపు, ఎల్లుండి రాజమహేంద్రవరంలో ‘టీడీపీ మహానాడు’ వేడుకలు

రేపు , ఎల్లుండి రాజమహేంద్రవరం లో టీడీపీ మహానాడు పండగ జరగబోతుంది. దీంతో రాజమహేంద్రవరం, వేమగిరి ప్రాంతాలు పసుపు మయంగా మారాయి. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ వేదిక ఇప్పటికే సిద్ధమైంది. రాజమహేంద్రవరం ప్రధాన వీధుల్లో పసుపు తోరణాలు దర్శనమిస్తున్నాయి.. ఇక మహానాడు కార్యక్రమానికి ఎంత మంది నేతలు, కార్యకర్తలు వచ్చినా అందరికీ తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. గతంలో 2006లో ప్రభంజనంలా నిర్వహించిన మహానాడు తరహాలోనే తిరిగి మళ్లీ అదే ప్రాం తంలో కొన్నేళ్ల తరువాత జరపనున్న మహా నాడుకు అశేష ప్రజానీకం తరలివచ్చేందుకు సంసిద్ధమవుతున్నాయి.

ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంకా క్లియరెన్సు ఇవ్వలేదు. స్కూలు బస్సులపై కూడా రవాణా శాఖ ఆంక్షల నేపథ్యంలో ఏ మేరకు ఇస్తారనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు టాటా ఎస్‌లు, కార్లు, లారీలు, ట్రాక్టర్ల వంటి వాహనాలపై సైతం జనాన్ని అక్కడకు తరలించడానికి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేమగిరికి భారీగా జన సమీకరణ చేసేందుకు రాష్ట్ర నాయకులు సైతం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మహానాడు సందర్బంగా టీడీపీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేందుకే లోకేష్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ముగిసింది. 30 వ తేదీ మళ్లీ ఇక్కడి నుండి యువగళ పాదయాత్ర కొనసాగుతుంది.