జులై 17, 18 తేదీల్లో మహంకాళి జాతర ఉత్సవాలు

జులై 17, 18 తేదీల్లో మహంకాళి జాతర ఉత్సవాలు ఘనంగా జరపబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారనే వార్తలను ఆయన ఖండించారు. అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ఇప్పటికే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని తలసాని తెలిపారు.

శుక్రవారం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఉజ్జయిని ఆలయానికి చేరుకుని.. ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రతిపక్ష పార్టీలు పన్నాగం పన్నుతున్నాయన్నారు. ఆలయంలో మూల విరాట్ మార్పు ఆలోచన లేదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ ప్రతిష్ట భంగం చేయాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిని అమ్మవారే శిక్షిస్తుందన్నారు.