డ్రైవర్ ఆత్మహత్య దిగ్భ్రాంతి కలిగించింది

మహబూబునగర్: ఆర్టీసి సమ్మె 40వ రోజుకి చేరింది. తమకు న్యాయం జరగదని మనస్తాపానికి గురై మహబూబునగర్ డిపోకు చెందిన డ్రైవర్ నరేష్ కొద్ది గంటల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సంఘటనపై స్పందించిన బిజెపి ఎంపి బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. మహబూబునగర్ డిపో డ్రైవర్ ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆర్టీసి కార్మికుల సమ్మె 40వ రోజుకి చేరినా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడాన్ని తప్పుబట్టారు. కార్మిక ఆత్మహత్యలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందిచకపోవడం విచారకరమని అన్నారు. కార్మికులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, వారి ఉద్యమంలో ఎల్లప్పుడూ తాను ఉంటానని భరోసా ఇచ్చారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/