మోడి, జిన్‌పింగ్‌ల భేటికి మహాబలిపురం ముస్తాబు


మధ్యాహ్నం 2.10 గంటలకు రానున్న జిన్‌పింగ్

Mahabalipuram Summit
Mahabalipuram Summit

చెన్నై: చెన్నైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోడీతో రెండు రోజుల పాటు అనధికారిక శిఖరాగ్ర చర్చలు జరపడానికి శుక్రవారం ఇక్కడికి రానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలకడానికి నగరం సుందరంగా ముస్తాబయింది. విమానాశ్రయంలో దిగగానే జిన్‌పింగ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలకడంతో పాటుగా దక్షిణాది కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయన ప్రయాణించే దారి పొడవునా భారీ ఆర్చీలు కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇరువురు నేతల చర్చలకు వేదిక అయిన మహాబలిపురం అంతటా ఎక్కడ చూసినా పోలీసులు, ఎస్‌పిజి జవాన్లతో పాటుగా శిఖరాగ్ర చర్చల కోసం తుది ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన అధికారులతో హడావుడిగా కనిపిస్తోంది.

ఇరువురు నేతలు చర్చలు జరిపే సముద్రపు ఒడ్డున ఉండే మహాబలిపురం ఆలయం వద్ద తాత్కాలికంగా బులెట్‌ప్రూఫ్ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. గురువారం రాష్ట్ర ప్భుత్వ పోలీసు, ఇతర ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, మోడీ, జిన్‌పింగ్‌లకు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలలో అవసరమైన చిన్న చిన్న మార్పులను సూచిస్తూ కనిపించారు. ముఖ్యమంత్రి కె పళనిస్వామి సౌతం గురువారం మహాబలిపురం సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. కాగా శుక్రవారం మోడీ, జిన్‌పింగ్‌ల రాక దృష్టా ఈ ప్రాచీన కట్టడాల సందర్శనను పిలిపి వేయడంతో పాటుగా వాటి చుట్టూ బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. కాగా, ఈస్ట్ కోస్ట్ రోడ్‌నుంచి మహాబలిపురానికి వచ్చే రోడ్డు ఎంట్రన్స్ వద్ద ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ భారీ స్వాగత్తరణాన్ని ఏర్పాటు చేశారు.

ఆవి కాకుండా జిన్‌పింగ్ బస చేసే ఐటిసి గ్రాండ్ చోళ హోటల్ ముందు కూడా అరటి చెట్లు, చెరకు గడలతో తమిళ సంప్రదాయ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. జిన్‌పింగ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు దాదాపు 500 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సంప్రదాయ కళా రూపాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. తమిళ జానపద కళారూపమైన ఖటప్పుగ(డప్పు!) వాద్య ప్రదర్శన కూడా వీటిలో ఉంటుంది. ఇదే కాకుండా భరతనాట్యం, కథాకళిలాంటి నృత్యప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం మహాబలిపురంలో ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలే కాకుండా నగరంలోను, మహాబలిపురంలోను అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలకోసం తాత్కాలిక వేదికలను ఏర్పాటు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/