వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌

Magnus Carlsen
Magnus Carlsen

కోల్‌కతా: టాటా ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీలో హాట్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన నార్వే గ్రాండ్‌ మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అంచనాలకు తగ్గట్టే రాణించి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ రెండు విభాగాల్లో అన్ని రౌండ్లు ముగిసేసరికి కార్ల్‌సన్‌ 27 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా హికారు నకముర(అమెరికా) ద్వితీయ, వెస్లీ సో (అమెరికా) తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐవరీ కోస్ట్‌లో జరిగిన గ్రాండ్‌ చెస్‌ టోర్నిలో 26.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన కార్ల్‌సన్‌ తాజా టీర్నీలో 27 పాయింట్లు సాధించి తన పేరిట ఉన్న గత రికార్డును తిరగరాశాడు. కార్ల్‌సన్‌కు 37,500 డాలర్లు (రూ.26 లక్షలు 81 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత గ్రాండ్‌ మాస్టర్లు విశ్వనాథన్‌ ఆనంద్‌ 16 పాయింట్లు ఏడో స్థానంలో, పెంటేల హరికృష్ణ 14.5 పాయింట్లు ఎనిమిదో స్థానంలో, విదిత్‌ సంతోష్‌ గుజరాతి 14.5 పాయింట్లు తొమ్మిదో స్థానంలో నిలిచారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/