ఉత్తర-మధ్య పెరూలో భారీ భూకంపం

Earthquake Strikes North-Central Peru
Earthquake Strikes North-Central Peru

పెరూ: ఉత్తరమధ్య పెరూలో రోజు తెల్లవారుజామున 2.41కి గంటలకు భారీ భూకంపం సంభవించిందని యూఎస్‌ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు వివరించింది. అయితే ఆగ్నేయ ల్యాగునాస్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, యురీమ్యాగ్వాస్‌ నగరానికి 158 కిలో మీటర్ల దూరంలో 114 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.దీనిపై పెరూ ప్రభుత్వం కూడా ట్విటర్‌లో స్పందించింది. రిక్టర్‌ స్కేలుపై మొదట 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని, లిమా, కల్లావూ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు వివరించారు.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/