మ్యాజిక్ కేక్‌ల ఆర్భాటం

బర్త్‌డే అంటే కేక్‌లతో పండుగే. ఒక్క బర్త్‌డే మాత్రమే కాదు ఏ వేడుకలలోనైనా కేకులతో ఆర్భాటం. అయితే మురిపించే కేకుల్లో ఎన్నో వెరైటీలున్నాయి. ఇందులో యాంట్రీగ్రావిటీ కేక్స్లు ఒకటి.
ఈ యాంటీగ్రావిటీ కేక్స్ ఈ మధ్య పార్టీల్లో తెగ సందడి చేస్తున్నాయి. ఓ కేక్ మీద.. గాల్లో తేలుతున్న ప్యాకెట్లనుంచి జెమ్స్ పడుతుంటాయి. ఇంకో కేకుమీద.. గాల్లో వేలాడుతున్నట్లుంటుంది. మరో కేకుమీద. పైన తేలుతున్న మగ్గులోంచి కిందున్న కప్పులోకి పాలు పడుతుంటాయి. ఎంత చిత్రమది. పార్టీలో కనిపించిన ఆ మూడు కేకుల్నీ చూసి, నాకు మతిపోయిందనుకోండి. ఇది నజమేనా అని ఓ క్షణం నా చేయి, నేనే గిల్లుకుని కూడా చూసుకున్న తెలుసా. తెలిసినవాళ్ల పాప పుట్టినరోజు పార్టీకి వెళ్లొచ్చిన రాగిణి ఇంటికొచ్చిక ఆ విశేషాల్ని ఆశ్చర్యపోతూ ఎంత మందికి చెప్పందో అదే యాంటీగ్రావిటీ కేకుల మహిమ. వీటిని ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. కేకు పైన అవన్నీ గాల్లో ఎలా తేలుతున్నాయబ్బా. ఆలోచనలో పడాల్సిందే. పిల్లలకైతే ఇవి హ్యారిపాటేర్ సినిమాలోని అద్భుతాలనే చూసినట్లుంటుందనడంలో సందేహం లేదు.
యంటీగ్రావిటీ కేక్‌ల ఆలోచన మొదట ఎవరికి వచ్చిందో కానీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఇదో ట్రెండ్ అయిపొయింది. ఇంతకీ కేకుల పైన రకరకాల వస్తువ్ఞలుగా గాల్లో అలా ఎలా తేలుతున్నాయంటారా. దానికొట్రిక్ ఉంది. ఉదాహరణకు ప్యాకెట్లోంచి జెమ్స్ పడుతున్నట్టున్న కేక్నే తీసుకుంటే మనకు ఆ ప్యాకెట్ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది.

కానీ నిజానికి ఆది కేకులో గుచ్చిన స్ట్రాకు అతుక్కుని ఉంటుంది. అయితే, స్ట్రా చుట్టూ జుమ్స్ని పోసినట్లూ అతికించడం వల్ల అది మనకు కనిపించదు. కప్పులూ సీసాల్లాంటివాటిని కూడా ఈ పద్దతిలోనే ప్లాస్టిక్ పుల్లలాంటివాటిని కేక్‌లో గుచ్చి వాటికి అంటిస్తారు.ఆ ప్ల్లులు పైకి కనిపించకుండా కప్పులో నుంచి పాలు పడుతున్నట్లూ సీసాలోంచి సాస్ కారుతున్నట్లూ క్రిమ్తో అలంకరణ చేసి కళతో కళ్లను మాయ చేసేస్తారు. అయితే, ఈ తరహా కేకుల్లో పైనకప్పులాంటివాటిని తక్కువ బరువ్ఞన్న వాటిని ఎంచుకోవాలి.ఇక, గాల్లో తేలుతున్న చాప్‌స్టిక్స్ గిన్నెలో నుంచి నూడుల్స్‌ని పైకి లేపినట్లూ ఏ ఆధారం లేకుండా వేలాడుతున్న నీళ్ల జగ్గు పూలకుండీలోని మొక్కలకు నీళ్లు పోస్తున్నట్లూ… ఇలా యాంటీగ్రాఇటీ కేకుల్లో వస్తున్న వెరైటీలు అన్నీ ఇన్నీ కావ్ఞ ఏమైనా వీటిని తయారు చేసే వారికి మంచి టేస్ట్ ఉందండీ… ఏమంటారు?
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/