‘వెండితెర అద్భుతం’.. పదేళ్లు..

MAGADHEERA. 10 YRS
A still From MAGADHEERA

సరిగ్గా పదేళ్ల క్రితం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రెండోసినిమా విడుదలైంది.. రాజమౌళి వంటి దర్శకుడితో ఆ టైంలోనే నలభై కోట్ల బడ్జెట్‌తో అల్లు అరవింద్‌ మగధీర ప్రకటించారు.. కట్‌చేస్తే 20019 జూలై 31న టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర లిఖించబడింది.. అదే మగధీర.. మొదటి షో సూపర్‌హిట్‌ టాక్‌తో మొదలై ప్రతి ఆటకు జాతరను తలపించే వాతావరణంతోథియేటర్‌ ఓనర్లను కలెక్షన్లు ఉక్కిరిబిక్కిరిచేశాయి.. 302 కేంద్రాల్లో 50 రోజులుఎ, 223 కేంద్రాలో శతదినోత్సవం జరుపుకుని మగధీర సృష్టించిన సునామీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.. సోలో నిర్మాతగా గీతా ఆర్ట్స్‌ ఈ ఒక్క సినిమా నుంచే రూ.58 కోట్ల షేర్‌ అందుకుందని అప్పట్లో శిరీష్‌ తన బ్లాగ్‌లో పోస్ట్‌చేయం సెన్సేషన్‌.. అందుకే ఈ స్వీట్‌ మెమరీని ఫ్యాన్స్‌ చాలా స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు.