రెండు కార్లపై పోలీసు …రూ 5 వేల జరిమానా

బాలీవుడ్‌ సినిమా తరహలో స్టంట్‌ .. మందలించి జరిమానా వేసిన ఎస్పీ

police-stunts-two-cars

దోమోహ్‌: మధ్యప్రదేశ్ లోని దామోహ్ ప్రాంతంలోని నార్సింగ్ గర్డ్ ఎస్ఐ మనోజ్ యాదవ్, ఇటీవల అక్షయ్ కుమార్ ‘సింగం’ సినిమాలోని ఓ స్టంట్ ను అనుకరించాడు. రెండు కార్లపై రెండు కాళ్లను పెట్టి అతను నిలబడగా, కార్లు కదిలాయి. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో, అతని ప్రాణాంతక చర్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. మనోజ్ కుమార్ పై రూ. 5 వేల జరిమానా విధించామని అన్నారు. యువతపై చెడు ప్రభావాన్ని చూపేలా మరోసారి ఇటువంటి పనులు చేయవద్దని మందలించామని ఆయన తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/