ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గవర్నర్ ఆమోదం

ఫైల్ పై సంతకం చేసిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను గవర్నర్ తమిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు.

తొలుత కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఫైలును గవర్నర్ హోల్డ్ లో ఉంచారు. దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పేర్లను పరిశీలించిన కేసీఆర్… చివరకు మధుసూదనాచారికి అవకాశాన్ని కల్పించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/