న్యూఇయర్‌ వేడుకల్లో శ్రుతి మించోద్దు

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకే: మాదాపూర్‌ పోలీస్‌

new year celebrations
new year celebrations

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల్లో ఎవరైనా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ పోలీసులు హెచ్చరించారు. 31న అర్థరాత్రి వాహనాలను వేగంగా నడిపినా, ఇతరులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువతీ యువకులను శ్రుతి మించకుండా వేడుకులు జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలల్లో న్యూ ఇయర్‌ వేడుకులను జరుపుకోవడం నిషేధం అని తెలిపారు. అంతేకాకుండా ఈవెంట్‌ల నిర్వహకులు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్‌ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మాదాపూర్‌ సీఐ వెంకట్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పని సరి అని స్పష్టం చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/