“మా” సభ్యులకు ఉచిత వైద్యం ..టాప్ హాస్పటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న మంచు విష్ణు

మా ఎన్నికల మేనిఫెస్టో లో ఏమైతే హామీలు ఇచ్చారో మంచు విష్ణు వాటిపై దృష్టి సారించారు. ఎన్నికల వేల విష్ణు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు చూస్తే జనరల్ ఎలక్షన్స్ లో పొలిటీషియన్స్ ని మించిపోయాడు అనిపించింది. కానీ అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు ఇప్పటికే మా భవన్ ఫై ఓ నిర్ణయం తీసుకున్న విష్ణు..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యుల వైద్యం ఫై దృష్టి సారించిన విష్ణు ..అపోలో, ఏఐజీ, కిమ్స్, మెడి కవర్, సన్ షైన్ ఆస్పత్రుల తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై గోపి కన్సల్టేషన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత సౌకర్యం కూడా కల్పించనున్నట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు చేస్తామని ఆయన ప్రకటన చేశారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నామ‌ని పేర్కొన్నారు. వ‌చ్చేనెల‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ హాస్పిటల్స్ లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఒకదాని తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు అందరి మన్ననలు పొందుతున్నాడు.