టిడిపికి కార్పొరేటర్‌ మందడి రాజీనామా

m srinivasarao
m srinivasarao, tdp corporater


హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో టిడిపి పార్టీలో ఉన్న కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేటర్‌ పదవితో పాటు టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే టిడిపి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం తనను బాధించిందని ఆయన పేర్కోన్నారు.