వేదాద్రి ప్రమాద మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సిఎం జగన్ ఆదేశాలు

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద నిన్న ఓ ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో
12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులలో ముగ్గురు తప్ప మిగిలినవారందరూ తెలంగాణవారే. అయితే, ఘటన జరిగింది ఏపిలో కావడంతో సిఎం జగన్‌ మానవతా దృక్పథంతో వ్యవహరించి తెలంగాణ వారికీ వర్తించేలా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని సీఎంవో వెల్లడించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఓ ట్వీట్ లో తెలిపింది.  తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన ముగ్గురికి కూడా నష్టపరిహారం వర్తిస్తుందని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/