లంచ్‌ బాక్సులు

లంచ్‌ బాక్సులు
Lunch Boxes

మహిళా ఉద్యోగిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలతో డిగ్రీలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేయాలనే భావన మాత్రం నేటి మహిళలకు ఉంది. దీంతో మహిళలు ఉద్యోగబాటలో పడ్డారు. ఉద్యోగం అనగానే మధ్యాహ్నం భోజనం కూడా పనిచేస్తున్న చోటనే తినాలి. పిల్లలకు ఉదయాన్నే లంచ్‌బాక్సులు కట్టాలి. ఉద్యోగిణిలు కూడా కట్టుకోవాలి. ఇలా ఒకేఇంట్లో రెండుమూడు లంచ్‌బాక్సులకు కట్టుకోవాలి.
స్టీలు బాక్సులూ టిఫినీలూ క్యారేజీలూ ఒక్కప్పుడు అన్నం తీసుకెళ్లడానికి అందరూఇవే వాడేవారు. తర్వాత హాట్‌ప్యాక్‌లూ టప్పర్‌వేర్‌ బాక్సులూ బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఏదైనా అక్కడితో ఆగిపోతే కొత్తదనం ఏముంటుందీ..టిఫిన్‌ బాక్సులో శాండ్‌విచ్‌లూ బర్గర్లను పెట్టుకోవడం సాధారణమే. కానీ ఆ బాక్సే శాండ్‌విచ్‌లా బర్గర్‌లా ఉంటే..క్యాంటీన్‌లోకి అన్నం బాక్సు బదులు పుస్తకాన్ని తెచ్చి ఎదురుగా పెట్టుకుని కూర్చుంటే దాన్ని తెరవగానే ఘుమఘుమలాడే వంటకాలు ప్రత్యక్షమైతే ఇక, క్యారేజీ చూడచక్కని బొమ్మలానూ, బాక్సు గిటార్‌లానూ హెల్లోకిట్టీ బాల్‌లానూ దర్శనమిస్తే చూసేవారెవరైనా ఆశ్చర్యపోకుండా ఉండగలరా..ఇలా షోకేసులో బొమ్మలా అని పించేలా లంచ్‌బాక్సులు ఎన్నో రకాలుగా ముస్తాబవ్ఞతున్నాయి. చేతిలో ఉండే ప్రతి వస్తువూ విభిన్నంగా ఉండాలని కోరుకునే ఈతరం కోసం ప్రత్యేకంగా తయారవ్ఞతున్నాయి. పెద్దలకే కాదు, అన్నం వద్దు అంటూ మారాం చేసే పిల్లలకు సైతం ఈ బాక్సులు తెగనచ్చేస్తాయనడంలో సందేహం లేదు. అంతేనా, చిన్నారులు వీటిని చూపించి స్నేహితుల దగ్గర ఫోజు కొట్టేస్తూ మరీ అన్నం తినేస్తారు. హైటెక్‌ ఫీచర్ల విషయానికొస్తే తినే సమయానికి కొంచెం ముందు యూఎస్‌బి ప్లగ్‌ గుచ్చితే భోజనాన్ని వేడెక్కించేవి కొన్నైతే బాక్సులే కుక్కర్లలా మారి తినే సమయానికి అన్నాన్ని వండి ఉంచేవి మరికొన్ని. కొన్ని ప్రత్యేక బాక్సులను గమనిద్దాం.
ఒకే దాన్లో వేడిగా చల్లగా అన్నం కూరా వేడిగా ఉంటే బాగుంటాయి. పెరుగు చల్లగా ఉంటే తినాలనిపిస్తుంది. పండ్లూ కూరగాయ ముక్కలు కూడా అంతే, వేడి తగిలితే పాడైపోతాయి. అందుకే, ఒకే క్యారేజీలో ఉన్న మూడు నాలుగు గిన్నెల్లో వేరువేరుగా వీటిని పెట్టినా అన్నం కూరల వేడి పెరుగుకీ పండ్ల ముక్కలకీ తగిలి అవి పాడైపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ‘ఓమీ బాక్స్‌. నాలుగు అరలుగా ఉండే ఈ బాక్సుని ప్రత్యేక నిర్మానంతో తయారు చేయడం వల్ల దీన్లోని ఒక అరలో పెట్టిన పదార్థాల వేడి మరో అర లోకి చొరబడదు. చల్లటి పదార్థాల చల్లదన మూ పక్కవాటికి సోకదు. కాబట్టి, వేరువేరు డబ్బాలతో పనిలేకుండా ఎంచక్కా ఒకే బాక్సులో వేడినీ చల్లటినీ తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి వంటకాలైనా వేడిగా ఉన్నపుడు ఉన్నంత రుచిగా చల్లారిపోతే ఉండవ్ఞ. కానీ ఎంత మంచి హాట్‌బాక్సుల్లో పెట్టినా కొన్ని గంటలే వేడిగా ఉంటాయి. మరోపక్కేమో ఆఫీసులు దూరంగా ఉండడమో మరో కారణంతోనో పొద్దుపొద్దునే వంట చేసేస్తాం. అవి మనం తినేసరికి చల్లగా అయిపోతుంటాయి. ఆ బాధంతా లేకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ హీటింగ్‌ లంచ్‌ బాక్సులు వస్తున్నాయి. మనం తినే కొద్ది నిమిషాల ముందు వీటి వైరుని ప్లగ్‌లో గుచ్చితే చాలు. పదార్థాలు చక్కగా వేడెక్కు తాయి. ఫోన్‌ చార్జర్‌లా వీటి వైరుని కూడా ఊర్తిగా తీసేసి బ్యాగులో పెట్టేసుకోవచ్చు. కాబట్టి మిగి లిన సమయాల్లో వైరు అడ్డంగా కూడా ఉండదు. అసలు వైరుతో పనిలేకుండా రీఛార్జబుల్‌ ఆ్యటరీలతో పనిచేసే హీట్‌ బాక్స్‌లు కూడా వస్తున్నాయి. ఇవి వ్ఞంటే ఎక్క డైనా ఎప్పుడైనా కరెంటుతో పనిలేకుండా బాక్సుకున్న బటన్‌ నొక్కి భోజనాన్ని వేడిగా చేసుకోవచ్చు.
బరువ్ఞ తగ్గాలన్నా అదుపులో ఉంచుకోవాలన్నా రోజూ తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలుంటున్నాయో తెలుసుకోవడం అవస రం. కానీ ప్రతిరోజూ అన్నం బాక్సులో తీసుకెళ్లే క్యాలరీలను కొలవ డం కష్టం. అదే ఈ ‘ప్రెప్డ్‌ ప్యాక్‌ లంచ్‌ బాక్సు ఉందనుకోండి. అందులో పెట్టిన పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు దాగున్నాయో రోజూ ఫోన్‌లోని ఆప్‌కి మెసేజ్‌ వచ్చేస్తుంది. అంతేకాదు, ఆరోగ్య రంగా క్యాలరీలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహా రం, వాటి రెసిపీలను కూడా ప్రెప్డ్‌ప్యాక్‌ ఆప్‌ సూచిస్తుంది.
బాక్సే కుక్కర్‌: పొద్దునెప్పుడో వండుకుని బాక్సులో పెట్టుకున్న అన్నం హాట్‌బాక్సులో పెట్టినా మధ్యాహ్నానికి వేడి తగ్గిపోతుంది. ఆమాత్రం దానికి ఉదయాన్నే హడివ్ఞడిగా తెచ్చుకోవడం ఎందుకు..బాక్సులో బియ్యం కడిగి పెట్టేసుకుని తినే అరగంట ముందు స్విచ్‌ ఆన్‌ చేస్తే పోలా ఈ ఆలోచనతో వచ్చినవే ఎలక్ట్రిక్‌ లంచ్‌ బాక్సులు. మినీ కరెంటు కుక్కర్లలా పనిచేసే వీటిలో ఒక్క గిన్నె ఉన్నవీ మూడు గిన్నెలున్న క్యారియర్లు కూడా ఉన్నాఇ. అంటే అన్నంతోపాటు పప్పు లాంటి వాటిని కూడా బాక్సులోనే కావాలనకున్నపుడు వండేసుకోవచ్చన్న మాట. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ మినీ కుక్కర్ల వైరుని కంప్యూ టర్‌ లేదా ప్లగ్‌లో గుచ్చేస్తే చాలు. వీటిలో రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసేవీ న్నాయి. ఇక, ఒక్కరిద్దరే ఉండే బ్యాచిలర్లు కుక్కర్లో వండి వాటిని మళ్లీ హాట్‌ బాక్సులో పెట్టుకునే అంత ఈ ఎలక్ట్రిక్‌ లంచ్‌ బాక్సుల్లో వేంసుకుని తీసుకెళ్లిపోవచ్చు కూడా. తీసుకెళ్లడానికీ తినడానికీ లంచ్‌ బాక్సు ఉంటే సరిపోదు, దాన్ని తీసుకెళ్లందుకు ఓ బ్యాగుని కూడా కొనాలి. ఆ ఇబ్బంది లేకుండా ఈ ‘డైన్‌ ఎవే లంచ్‌బాక్స్‌ని బ్యాగుతో కలిపే కూపొందించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/