ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన లుఫ్తాన్సా

ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా రష్యా దాడికి దిగుతుందన్న వార్తలు

కైవ్: జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు సర్వీసులు నిలిపివేసింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటి ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. అయితే, ఈ రెండు ప్రాంతాలకు తప్ప మిగిలిన నగరాలకు మాత్రం ఈ నెలాఖరు వరకు సేవలు కొనసాగుతాయని లుఫ్తాన్సా స్పష్టం చేసింది. కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం కూడా గత వారమే కీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/