మళ్లీ పెరిగిన గ్యాస్​ సిలిండర్ ధర

డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 3.50 పెంపు


న్యూఢిల్లీ: పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో 1056కు పెరిగింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే.

ఇక 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న సిలిండర్‌పై రూ.102.50 భారం మోపిన విషయం విధితమే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/