రూ. 120 పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

సామాన్యుడిపైనే అధిక భారం

Gas cylinders
Gas cylinders

హైదరాబాద్‌: ప్రతీ నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుడిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఉల్లిపాయ, టమాటా, మిర్చి ఇలా ఏ వస్తువు చూసినా సామాన్యుడికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఈ ధరలు. ఒక్కొక్కటిగా ధరలు పెరుగుతూ ఉంటే జనం వాటిని కొనాలంటేనే భయపడి చస్తున్నారు. ఇదిలా ఉంటే దీనికితోడు మరోకటి వచ్చి ఈ జాబితాలోకి చేరింది. వంట గ్యాస్‌ ధరలు కూడా నింగినంటుతున్నాయి. దాదాపు గడచిన నాలుగు నెలల్లోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 120 పెరిగింది. ఆగస్టులో 14.2 కిలోల హెచ్‌పి సిలిండర్‌ ధర రూ. 628 ఉండగా, డిసెంబర్‌లో గ్యాస్‌ బుక్‌ చేసిన వారికి సిలిండర్‌ ధర రూ. 748 చూపిస్తోంది. దీంతో గ్యాస్‌ ధరలు అమాంతం పెంచేసారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందనే చెప్పాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/