బంగాళాఖాతంలో అల్పపీడనం

depression
depression

విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.ఈ నెల 5 వరకు ఈదురు గాలుల తీవ్రత ఉంటుందని, గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని తెలిపింది. అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అయితే తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/