ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలోని మొద్దుల చెరువులో ఘటన

Suicide
Suicide

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం..ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కలిసి జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు. అయితే, పెద్దలు అందుకు అడ్డు చెప్పారు. దీంతో పెద్దలను ఎదిరించలేక, విడిపోయి బతకలేక తనువు చాలించారు.

గ్రామ శివారులో ఓ చెట్టుకు ఆ యువతీయువకులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమికుడు చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌గా పోలీసులు గుర్తించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/