బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ కెమెరా కు చిక్కిన లవర్స్

ఈ మధ్య ప్రేమ పేరుతో యువత బాగా చెడిపోతున్నారు. కామ కోర్కెలు తీర్చుకోవడం కోసం ప్రేమను అడ్డుగా చెప్పుకుంటూ హద్దులు దాటుతున్నారు. వీరిలో నిజమైన లవర్స్ ఉంటె..కొంతమంది ఫేక్ లవర్స్ ఉన్నారు. అయితే ప్రేమ ముసుగులో నడి రోడ్ ఫైనే రొమాన్స్ చేసుకుంటూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. పార్క్ లు , సినిమా థియేటర్స్ , పబ్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ హద్దులు దాటుతున్నారు. తాజాగా ఓ యువత ఏకంగా బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నంలోని ప్రధాని రహదారిపై చోటు చేసుకుంది.

ఈ వీడియో వైరల్ కావడం తో పోలీసులు ఆ యువతను అదుపులోకి తీసుకొని , ఇరువురిపై కేసు నమోదు చేసారు. అలాగే వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీప వెంపలినగర్‌, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు.