బంధాలను నిలిపేది ప్రేమానురాగాలే

జీవన వికాసం

Family Relations
Family Relations

కుటుంబంలో అత్త కీలకం. అయితే అత్త మీద వచ్చే విమర్శలు మరే సంబంధంలోను ఉండవు. కొడుకు, కోడలు, తల్లి ఈ ముగ్గురి మధ్య సాగే బంధంలో ప్రతి ఒక్కరు తమ పరిమితులు ఎరిగి ప్రవర్తించాలి.

కోడలి వల్ల కొడుకు తనకు ఎక్కడ కాకుండా పోతాడోననే భయం, సందేహాల వంటివి తల్లిని చుట్టుముడతాయి. దాంతో కోడలి మీద అధిపత్య ధోరణి చూపిస్తుంది. కోడలి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది.

అత్త తన భర్తను తన నుంచి దూరం చేస్తుందన్న అపోహ, వ్యతిరేక భావం కోడలికి ఉంటుంది. ఇద్దరి మధ్య ఇలాంటి సమస్యలు ఉండకూడదంటే వారి మధ్య పరస్పర అవగాహన అవసరం.

అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి.

ఇద్దరూ ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు అత్తను కోడలు ప్రేమగా వ్యవహరించాలి. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవాలి.

ప్రస్తుతం మరింత పొడిగించిన లాక్‌డౌన్‌ వల్ల చాలా కుటుంబాలు ఇళ్లలోనే ఉంటున్నాయి. రోజూ ఆఫీసుకు హడావుడిగా పరుగులు పెట్టేవారికి ఇది కొంచెం బాగానే ఉంటుంది. కాని ఎక్కువ రోజులు ఇంట్లో ఉండటం కొంచెం కష్టంగానే ఉంటుంది.

అదే సమయంలో కుటుంబసభ్యులంతా ఒకే సమయంలో ఒకే దగ్గర గడపడం అంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. మరీ ముఖ్యంగా సాధారణంగా సమస్యలు వస్తుంటాయి.

అయితే ఉద్యోగానికి వెళ్లే కోడలయితే ఏదో ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుంది. తన పనేదో తను చూసుకుంటుంది.

సెలవు రోజుల్లోనే ఇంట్లో ఉండటమో బయటికి వెళ్లటమో ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బందులు ఉండవు.

కాని ఈ రోజుల్లో తప్పనిసరిగా అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఒకరి విషయల్లో ఒకరు కలుగచేసుకోవటం వంటి వస్తుంటాయి. అత్త అనగానే చాలా మంది కోడళ్లు అయిష్టతను ప్రదర్శిస్తారు.

పెళ్లయి ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి కోడలి విషయంలో దాదాపు అత్తలు కూడా అలాగే ఉంటుంటారు.

కాని అత్త పట్ల కోడలు, కోడలి పట్ల అత్త ఆప్యాయతలు చూపించడం పెద్ద కష్టమైన పేమీ కాదు. కొంతమంది అలా ఉంటూ అసలు వాళ్లు అత్తాకోడళ్లు కాకుండా తల్లీకూతుళ్లలా ఉంటుంటారు.

ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల మరొకరు స్నేహంగా మసలుకుంటే అత్తాకోడళ్ల బంధం చూడ ముచ్చటగా ఉంటుంది. కుటుంబంలో అత్త కీలకం.

అయితే అత్త మీద వచ్చే విమర్శలు మరే సంబంధంలోను ఉండవు. కొడుకు, కోడలు, తల్లి ఈ ముగ్గురి మధ్య సాగే బంధంలో ప్రతి ఒక్కరు తమ పరిమితులు ఎరిగి ప్రవర్తించాలి.

కోడలి వల్ల కొడుకు తనకు ఎక్కడ కాకుండా పోతాడోననే భయం, సందేహాల వంటివి తల్లిని చుట్టుముడతాయి. దాంతో కోడలి మీద అధిపత్య ధోరణి చూపిస్తుంది.

కోడలి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది.

అత్త తన భర్తను తన నుంచి దూరం చేస్తుందన్న అపోహ, వ్యతిరేక భావం కోడలికి ఉంటుంది. ఇద్దరి మధ్య ఇలాంటి సమస్యలు ఉండకూడదంటే వారి మధ్య పరస్పర అవగాహన అవసరం.

అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి.

ఇద్దరూ ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు అత్తను కోడలు ప్రేమగా వ్యవహరించాలి. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవాలి. స

ెలవు రోజుల్లో ఒకరు ప్రత్యేకంగా ఏమైనా చేయాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం పటిష్టమవుతుంది. స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు. అలా ఉన్నప్పుడు అత్తకు కోడలిపై కోపం రాదు.

కోడలు అభద్రతా భావానికి లోనుకాదు. కోడలి పట్ల కోపం, ద్వేషం చూపించడం వల్ల అత్తకు ఏం ప్రయోజనం ఉండదు. దాని వల్ల ప్రశాంతత కూడా కరువవుతుంది.

అలాగే తన అతి ప్రేమతో కొడుకును, కోడలిని ఇబ్బంది పెట్టడం కూడా సరికాదు.

చాలా సందర్భాలలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న పోటీతత్వం వల్ల కాపురాలలో కలతలు రేగి చిన్నాభిన్న మవుతాయి. తను లేకపోతే కొడుకు ఏమీ చేసుకోలేడని, తినలేడు, ఉండలేడని భావిస్తుంది.

పెళ్లయిన తర్వాత కొడుకు మనసులో తన స్థానం ఎక్కడ పోతుందోనన్న భయం తల్లిని వెంటాడుతుంది. ఇలాంటి సందర్భాలలోనే తల్లులు వివేకంతో మసలుకోవాలి.

కొడుకును పెంచి పెద్దచేయడం, విద్యాబుద్ధులు నేర్పడం, మంచి, చెడుల విచక్షణ నేర్పించడం, కుటుంబాన్ని నడిపించేలా తీర్చిదిద్దడం వరకే తన బాధ్యతని తల్లి గ్రహించాలి.

పెళ్లి తరువాత కొడుకు తనదైన కుటుంబ జీవితాన్ని ఏర్పరచు కుంటాడని తెలుసుకోవాలి. అతడి కుటుంబ వ్యవహారాలలో తాను తలదూర్చకూడదని తల్లి గ్రహించాలి.

అలాగే కోడలు కూడా తన భర్తను పెంచి పెద్దచేసిన అత్తకు ఇచ్చే ప్రాధాన్యతలో లోటు లేకుండా చూడాలి. అత్తకు తగిన గౌరవం ఇవ్వాలి.

ఆ గౌరవాన్ని అత్త తన పెద్దరికంతో, అనుభవంతో నిలబెట్టుకోవాలి. అప్పుడు కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. కొడుకు, కోడలు జీవితాల్లో అత్త కలగచేసుకోకూడదు.

ఇలా చేసుకోవడం వల్ల చాలా సందర్భాలలో భార్యభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి.

అలాగే కోడలు చేసే ప్రతి పనిని అత్త విమర్శించడం వల్ల కూడా అత్తాకోడళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరతాయి.

అయినదానికి కాని దానికి విమర్శించడం వల్ల అత్తగారంటే కోడలికి పడని పరిస్థితి తలెత్తుతుంది.

అందుకే అత్త, కోడలు, కొడుకు ఈ ముగ్గురు తమ తప్పొప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగితేనే వారి మధ్య బంధం బలపడుతుంది.

ఆధిపత్యం చూపించాలనుకుంటే శత్రువులుగా ఉండిపోతారు. కోడళ్లు కూడా తరువాతే అత్తలే అన్న విషయం వారు కూడా మరువవద్దు. ఇందుకు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

కోడలిని ఇంట్లో మనిషిలాగా చూసుకోవాలి. అత్తాకోడల్లిద్దరు ఒకరి పట్ల ఒకరు స్నేహంగా మసలుకోవాలి.

కోడలి మంచిని తనెప్పుడూ కాంక్షిస్తాననే భావం కోడలికి వచ్చేలా చేయాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భాలలో కోడలికి అభినందనలు తెలపాలి.

అప్పుడప్పుడు ఏమైనా బహుమతులు ఇస్తుండాలి. కోడలి గురించి ఇతరుల ఎదుట తప్పుగా మాట్లాడకూడదు. కొడుకు, కోడలు వైవాహిక జీవితం విషయంలో ఉచిత సలహాలు ఇవ్వకూడదు.

అవసరమయితే చెప్పేందుకు ప్రయత్నించాలి. అలా కోడలికి మంచి భావన కలుగచేస్తే ఇద్దరు పరస్పరం ప్రేమానుబంధాలతో దగ్గరవుతారు. ఇంటిని ఇద్దరు చక్కగా చూసుకోగలుగుతారు.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/