లవ్ స్టోరీ రిలీజ్ డేట్ మళ్లీ మారింది

లవ్ స్టోరీ రిలీజ్ డేట్ మళ్లీ మారింది

కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది..థియేటర్స్ ఓపెన్ అయ్యాయి ఇకనైన సినిమాలు రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తుంటే..వరుస షాకులు తగులుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకున్న ఆయా చిత్ర నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటూ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ముందుగా ప్రకటించిన సినిమాల డేట్స్ అన్ని మారుతున్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ సెప్టెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ మూవీ సెప్టెంబర్ 23న కానీ 30న విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి కారణం సెప్టెంబర్ 10 న నాని నటించిన టక్ జగదీష్ మూవీ ఓటిటిలో రిలీజ్ కావడం తో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో ఆక్చుపెన్సీ కారణాలతో రిలీజ్ వెనక్కు వెళ్లినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 3 న వస్తుందనుకున్న సిటీమార్ మూవీ సెప్టెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మూవీ మీద లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశే అని చెప్పాలి.