జపాన్‌లో తెలంగాణ శాస్త్రవేత్తకు అవార్డు

thallapalli-mogalgi
thallapalli-mogalgi

జపాన్‌: పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్‌ తాళ్లపల్లి మొగిలి జపాన్‌లోని అంతర్జాతీయ పట్టు కమిషన్‌ నుంచి ప్రతిష్ఠాత్మక లూయీస్‌ పాశ్చర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. జపాన్‌లోని సుకుబా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన మొగిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. మల్బరీలో కొత్త వంగడాల అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారు. 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/