19న దేశవ్యాప్త లారీల సమ్మె

Lorrys' Strike
Lorrys’ Strike

New Delhi: ఈనెల 1వతేదీ నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నాయి. ఈనెల 19న ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లారీల సమ్మె కొనసాగనుంది. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. తమ అసమ్మతిని నమోదు చేసుకోవడానికి ఈ సమ్మెలో చేరనున్నట్లు తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.