దుష్ట గజం – కువలయపీడం

ఆధ్యాత్మిక చింతన

Lord Krishna
Lord Krishna

కంసుని పట్టపుటేనుగు పేరు కువలయపీడం. భారీ కాయం, విశాలమైన చెవులు, పదునైన దంతాలు దాన్ని చూడగానే భయ కంపితులవుతారు ఎంతటివారైనా.

అది ఘికారం చేసింది అంటే అంతే, తొండం ఇటూ తిప్పుతూ నడుస్తూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే.

కంసుడు ఎంతటి క్రూరుడో, కువల యపిడం అంత క్రౌర్యం కలది అది విచ్చలవిడిగా రాజధాని వీధులలో అల్లకల్లోలం సృష్టిస్తే కంసుడు ఆనందించేవాడు. మావటీవాడు అంబస్థుడు దాన్ని అదుపులోకి తెచ్చేవాడు.

వాడి శిక్షణలోనే అదిరాటుతేలింది. అతడు చెప్పినట్లు ప్రవర్తించేది. పొరపాటున రాజస్థానం నుంచి బైటకు వస్తే మాత్రం దానికి పట్టపగ్గాలు ఉండవు.

ప్రజల ప్రాణాలు పై ఆశ వదులుకోవలసిందే. భారీ ఆస్తి నష్టం. ప్రాణ నష్టం జరిగేది. అందుకే దాని పేరు చెబితేనే పౌరల గజగజ వణికి పోయేవారు.

రాజ్యంలో ఉత్సవాలు జరిగేటప్పుడు కంసుడు ఆ కువలయాపిడం అధిరోహించి రాజ వీధులు దర్శించే వాడు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఎదురేగి తనికి నమస్కరించవలసినదే.

లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండేవి. అంబస్థుడి ప్రతి చర్యను, మాటను సునిశితంగా సూక్ష్మంగా గ్రహించేంది కువలయం. ఓ రోజు అంబస్థుడు కువలయపిడంపై కూర్చొని రాజ వీధులలో పయనిస్తున్నాడు.

అది రాజు వీధులలో నడుస్తూవ్ఞంటే అందరూ దూరం నుంచి నమస్కరించేవారు.
సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణ, బలరాములు రాజ వీధులలో నడుచుకుంటూ వస్తున్నారు.

అందరూ దానికి భయ, భయంగా నస్కరింస్తుంటే మీసాలు మెలేస్తూ వస్తున్నాడు అంబస్తుడు. అదే సమయంలో కువలయాపిడంకు ఎదురేగారు బలరామ, కృష్ణులు.

అది చూసి ఆ మావటి ప్రాణాలమీద ఆశ లేదా అడ్డు తొలగండి అన్నాడు.

అదే మాట మేము చెబుతున్నాం నీకు ఏ మాత్రం ప్రాణాలమీద ఆశ ఉంటే వెనక్కి వెళ్లు హెచ్చరించాడు. కృష్ణుడు, మావటి గర్వాంధుడై దాన్ని ప్రేరేపించాడు.

అది గట్టిగా ఘికారం చేస్తూ తొండంతో కృష్ణుని ఎత్తబోయింది. కృష్ణుడు ఒక్కసారిగా తొండమును పిడికిలితో మదించాడు.

ఆ దెబ్బకు దాన్ని కళ్లు బైర్లు క్రమ్మాయి. ఆ దెబ్బకు మావటి హడలిపోయి, అంకుశంతో ఒక్క పోటు పొడిచాడు.

ఆ పోటుకు అది దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కృష్ణుని పైకి రాబోతుండగా, కృష్ణుడు ముందు మావటిని సంహరించాలని వాడి తల మీద మోదాడు. వాడు రక్తం కక్కుకుని అక్కడే కులాడు.

కువలయపిడం భయంకరంగా ఘికారం చేస్తుండగా శ్రీకృష్ణుడు దాని కుంభస్థలంపైకి ఎక్కా డు. అది శరీరాన్ని అటూఇటూ తిప్పుతోంది. భయంకర విహారం చేస్తోంది.

బలరాముడు హెచ్ఛరించి కృష్ణా వధించు అన్నాడు ఆ మాటకు కృష్ణుడు దాని కుంభస్థం మీద బలంగా పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు.

ఆ దెబ్బకు దాని కళ్లుబైర్లు క్రమ్మి, గట్టగా అరుస్తూ కిందపడి ప్రాణాలు విడిచింది.

కువలయపిడం కింద పడగానే ప్రజలు అందరూ దాని చుట్టూచేరి ఈ దుష్ట గజం మధురా నగరిలో ఎందరి ప్రాణలో తీసింది.

ఈ రోజుతో దీని పీడ, అంబస్తుడి పీడ అంతమైంది. ప్రజలు బలరామ, కృష్ణలను అభినందిస్తూ జై అని నినాదాలు చేస్తుండగా, ఆ నినాదాలు అందుకుంటూ ముందుకు సాగిపోయారు బలరామ కృష్ణులు.

  • కనుమ ఎల్లారెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/