శ్రీకృష్ణ పరమాత్మ

శ్రీకృష్ణ పరమాత్మ
Lord Krishna

ప్రపంచమంతా పరమాత్మ వ్యక్తస్వరూపమైనపుడు అన్ని రూపాలు పరమాత్మవే. ప్రకృతిలో పరిమళించే చైతన్యం పరమేశ్వరుడే. అలాంటప్పుడు భగవంతుని అవలోకించడానికి, అర్చించ డానికి, ఆరాధించడానికి యోగ్యం కాని రూపమంటూ ఉండే అవకాశం ఉందా? అన్ని రూపాలు ఆయనివే. ఆ దివ్యాత్ముని స్వరూపాన్ని మన హృదయంలో నిలిపేవే. ఆదిత్యుని అవలోకిం చడంలో ఆరాధన ఉంది. చంద్రుని చల్లని వెన్నెలలో అర్చన దాగి ఉంది. పారే నదుల్లో పారాయణాలు ప్రవహిస్తాయి. పర్వతశ్రేణులు వేదపఠనాన్ని వినిపిస్తాయి. సముద్ర జలాల్లో సామగానాలు పొంగుతాయి. వీచే గాలుల్లో గాయత్రి ఊరేగుతుంది. భూః అంటూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. భువః అంటూ గాలి పచార్లు చేస్తోంది. సువః అంటూ వర్షం క్రిందికి జారుతోంది. మహః అంటూ ప్రకృతి పులకరించి పరవశిస్తోంది. ఇదంతా శ్వరానుభూతి. ఈశ్వర దర్శనానుభూతి. పరమేశ్వరుడు అనంతుడే కావచ్చు. నాకున్నవి చిన్న చేతులే అయినా ఆయన పవిత్ర పాదాలను స్పృశించేందుకు సరిపోతాయి. ఈ ఆశే నా ఆరాధనకు ఆయుష్షు. ఈ ఆశే నా ఉపాసనకు ఊపిరి. విశాలమైన సముద్రాన్ని ఆలింగనం చేసుకొనేటంతటి బాహు వ్ఞలు నాకు లేవ్ఞ. కాని సముద్రాన్ని పట్టుకోవాలనే అభిలాష నా హృదయంలో ఉంది. నేనేం చేయాలి? ఏదో చెయ్యలేను. నా సమీపంలో ఉన్న అలను తాకుతాను. ఆ క్షణంలో నేను సముద్రాన్ని తాకినవాణ్ణి అవ్ఞతున్నాను. అలాగే, అవగాహన ఉంటే, ఏ రూపమైనా పరమేశ్వ రుని గుర్తు చేస్తుంది. మనస్సు కుదుటపడితే ఏ నామమైనా ఈశ్వరుణ్ణే పిలుస్తుంది. చేతులు చలిస్తే పూజ. నోరు తెరిస్తే జపం. మనస్సు మనస్సులో నిలిస్తే ధ్యానం. అన్నీ సాధనలే. అంతా సాధనే. రోదనను రూపుమాపే ఆరాధనే. సాధన క్రియాత్మకమే కాదు. భావాత్మకంగా ఉండాలి. భావన భక్తికి పూర్ణత్వాన్ని కల్పిస్తుంది. బ్రతుకును భవ్యంగా మార్చు తుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రము చేసుకుని జీవిస్తాము. అలాగే ప్రతిరోజు పరమేశ్వరుని ఆరాధించి బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. మనస్సును నిరుత్సాహపరచే కర్మలు, బుద్ధిని నిర్వీర్యం చేసే కార్యాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటితో మనం సుఖపడలేము. మన మన స్సులను, మనుగడలను ఉత్సాహంగా ఉంచే వాటిమీదనే మన దృష్టిని కేంద్రీకరించాలి. ఏ కర్మ అయినా దేహంతోనే చేయాలి. మనస్సుతోనే చేయాలి. కర్మ చేసే దేహం పవిత్రంగా ఉండాలి. భావన చేసే మనస్సు నిర్మలంగా ఉండాలి.
అప్పుడే బ్రతుకు ధన్యమవ్ఞతుంది.
మనస్సును ఎవరికైనా ఇవ్వొచ్చు. తప్పు లేదు. కాని, ఎవరికిచ్చినా దానిని పాడుచేసే వారే. పగులగొట్టేవారే. మనస్సును చెడకుండా కాపాడేవాడు ఈశ్వరుడొక్కడే. ఆయనకు సమర్పిస్తేనే దానికి రక్షణ. భగవంతునికి మనం ఏమి ఇవ్వగలం? అంబరమంతటి దేవ్ఞడికి హారతి ఇచ్చేందుకు అను వైన పాత్ర మన ఇంట్లో ఉందా? ఏది ఇచ్చి తృప్తిపరచగలం? భక్తితో ఏది ఇచ్చినా భగవంతుడు సంతోషిస్తాడు. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నా మనస్సును మీకు ఇస్తాను అంటే ఎవ్వరూ తీసుకోరు. భగవంతునికి మనస్సు ఒక్కటి ఇస్తే చాలు. తృప్తి చెందుతాడు. మనకు నిత్యానందాన్ని అందించి ఆశీర్వదిస్తాడు. భక్తి భావనారూపంలో ఉంటుంది. కనుక భక్తిభావాలు సదా మనస్సులో కదుల్తూ ఉండాలి. భక్తి కార్యాలు చేస్తూ ఉంటే బుద్ధిలో భక్తిభావన స్థిరంగా ఉంటుంది. ఇల్లు చిమ్మడం కర్మ. కాని, చిమ్మేటప్పుడు పరమాత్మ వచ్చేందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నాను అనే భావన కదిలితే ఆ కర్మ భక్తికార్యమవ్ఞతుంది. తినడం పాపం కాదు. తినుబండారములను పరమేశ్వరుడు సృష్టించింది తినేందుకే. కాని, తినడంలో నిమగ్నమై తిండి పెట్టినవాణ్ణి మరచిపోవడం దోషం. భగవంతుడు ఇస్తేనే డబ్బు వచ్చింది. ధనవ్యామోహంలో పడి దైవాన్ని మరచిపోకూడదు. ప్రతి కర్మ భక్తికార్యం కావాలి. ధ్యానం చేసుకుని నిద్రిస్తే నిద్రలో కూడా భగవంతుడే తోడుగా ఉంటాడు. ఇదంతా భక్తికార్యం. భక్తి కార్యాలు చేస్తూ ఉంటేనే భక్తి జ్ఞాపకముంటుంది. బుద్ధిలో భక్తి లోపిస్తే మనస్సు ప్రపంచాన్ని గూర్చి ఆలోచి స్తుంది. బుద్ధిలో భక్తిభావన ఉంటే బ్రతుకులో భగవంతుడే తోడుగా ఉంటాడు. ఇదంతా భక్తి కార్యం. భక్తికార్యాలు చేస్తూ ఉంటేనే భక్తి జ్ఞాపకముంటుంది.
బుద్ధిలో భక్తి లోపిస్తే మనస్సు ప్రపంచాన్ని గూర్చి ఆలోచిస్తుంది. బుద్ధిలో భక్తిభావన ఉంటే బ్రతుకులో భగవంతుడు ఉంటాడు. పనిపాటలలో పరమేశ్వరుడే ఉంటాడు. మనస్సు పవిత్రమైతేనే భక్తిలో ఆనందం ఉంటుంది. భక్తికార్యాలు చేస్తేనే మనస్సు పవిత్రమవ్ఞతుంది. భావనలేని కర్మ నిష్ఫలం. కాని, క్రియారూపాన్ని ధరిస్తేనే భావనకు పూర్ణత్వం.
బుద్ధిలో భావసౌందర్యం నిండి, బ్రతుకులో జీవనసౌందర్యంతో కర్మలు పండితే సూర్యోదయ సమయాన చీకట్లన్నీ వెలుగులలో విలీన మైనట్లు కర్మలన్నీ జ్ఞానంలో విలీనమవ్ఞతాయి. ఇక్కడే బ్రతుకు భగవన్మయమవ్ఞతుంది. అర్జునా! సమస్తమైన కర్మలన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమవ్ఞతున్నాయి అన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/