ఆంజనేయుడికి సింధూరం ప్రీతిపాత్రం ఎందుకంటే ..

హనుమంతుని లీలలు

Lord Hanuma

ఆంజనేయస్వామికి చేసే అర్చనలో స్వామి విగ్రహానికి సింధూరం పూసే ఆచారం ఉంది. సింధూరం ఆంజనేయ స్వామికి ఎందుకు ప్రీతి పాత్రమనే విషయాన్ని రామాయణ గాధ మనకు తెలియజేసింది. రామ రావణ సంగ్రామం జరుగుతున్నపుడు ఓ సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేసాడు. ఆనాటి యుద్ధం లో రావణుడు సంధించిన బాణాలు ఆంజనేయుడికి తగిలాయి. హనుమ ఒళ్ళంతా రక్తసిక్త మైంది. అయినా, ఈ మాత్రం చలించకుండా దృఢ దీక్షతో హనుమ నిలబడ్డాడు. ఆ సమయంలో ఆంజనేయుడి దేహం పూచినా మోదుగ చెట్టు వలే ఉందని వాల్మీకి మహర్షి వర్ణించారు. తన స్వామి కోసం రక్త మోడటం హనుమకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. అర్చనలో భాగంగా భక్తులు తనకు సింధూరం పూస్తే ఆనాటి సంఘటన తలపులోకి వచ్చి హనుమంతుడు ఎంతగానో ప్రసన్నుడు అవుతాడట.. అందుకే ఆంజనేయుడికి సింధూరం పూసే ఆచారం ప్రచార మైంది . అంతే కాదు , యెర్రని రంగు పరాక్రమానికి పవిత్రతకు , త్యాగానికి సంకేతం. ఈ గుణాల సమ్మేళనమే హనుమంతుడు. అందుకే అర్చన చేసే సమయంలో ఆంజనేయుడు విగ్రహానికి సింధూరం పూసే విధానం వాడుకలోకి వచ్చింది.

‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/