రెండున్నర కిలోమీటర్లు నడిస్తే లాంగ్‌మార్చా?

రెండున్నర కిలోమీటర్లు నడిస్తే లాంగ్‌మార్చా?
YSRCP MP Vijaysai Reddy

Amaravati: జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన లాంగ్‌మార్చ్‌పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన లాంగ్‌మార్చ్‌పై ప్రజలు నవ్వుతున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శించారు. 1934లో చైనా కమ్యూనిస్ట్‌ ప్రజా విమోచన సైన్యం, 10వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించిందన్నారు. ఇసుక ఆందోళనపై రెండున్నర కిలోమీటర్లు నడిస్తే లాంగ్‌మార్చా? అని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/