ఒంటరి తనానికి అభిరుచే ఔషధం

వ్యధ: వ్యక్తిగత, మానసిక సమస్యలకు పరిష్కారం

lonelyness
lonelyness

నేను ఒంటరి తనంతో బాధపడు తున్నాను. నిద్రలేచి నప్పటి నుంచి నిరాశ, నిస్పృహాలు వెంటాడుతు న్నాయి. బతుకంతా భారంగా అని పిస్తోంది. నిస్సార జీవితం గడపడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే నయమనిపిస్తోంది. అయితే ఉన్న ఒక కూతురికోసం జీవశ్చవంలా బతుకు తున్నాను. గత కొంత కాలంగా ఏ పని చేస్తున్నా పరధ్యానం ఆవ హిస్తోంది. చేసేపని మీద గురికు దరడం లేదు. మనసు ప్రతికూల భావాల వెంట పరుగెడుతోంది. దిగులు, వ్యాకులత పోటీపడి నా మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. అందరు వ్యక్తుల్లా సరదాగా, సంతో షంగా బతుకుసాగించడం ఎలాగో తెలియడం లేదు. నా వయస్సు 46 ఏళ్లు ఇంటర్‌ వరకు చదవాను. 20 యేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నాను.

ఆయన డిగ్రీ వరకు చదవి, డ్రైవర్‌గా వృతి సాగించేవారు. మా పరిస్థితులను బట్టి అతను అన్ని విధాలా తగిన వాడని తలసి పెద్దలు పెళ్లిచేశారు. తొలుత నాలోకొద్ది అసంతృప్తి వున్నప్పటికి అతని మంచితనం, ప్రేమ, ఆదరణ నన్న ఆకట్టుకున్నాయి. అతనికి ఎలాంటి వ్యసనాలు, అనవసర వ్యవహారాలు లేకపోవడం వల్ల సంపాదించిన డబ్బు మొత్తం నాకే ఇచ్చేవారు. నేను ఉన్నంతలో పొదుపుగా సంసారం చేసేదాన్ని. మా ప్రేమకు ప్రతిరూపంగా ఏడాది తిరక్కుండానే ఓ పాప పుట్టింది.

వచ్చే సంపాదనకు ఒక బిడ్డేచాలని ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాము. పొదుపుగా జీవనం సాగించడం వల్ల నెలకు ఐదారు వేలు మిగిలేది. ఆ డబ్బుతో చీటీలు కట్టి మరింత ఆదాయం పెంచి ఐదేళ్లలో ఓ చిన్న స్థలం కొన్నాము. రెండేళ్ల తరువాత ఇల్లు కట్టుకున్నాము. పాపను ఉన్నంతలో మంచి పాఠశాలలో చదివింకుంటూ, హాయిగా కాలం గడిపేవాళ్లం. అయితే దేవుడు మా అన్యోతను చూసి ఓర్వలేకపోయారు. పదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఆయనను పోగొట్టుకున్నాము.

దీంతో నేను, పాప దిక్కులేని పక్షులమయ్యాము. ఆయన ప్రమాదంలో చనిపోవడంవల్ల పదిలక్షలు ఇన్‌ష్కూరెన్స్‌ డబ్బు వచ్చింది. ఎంత డబ్బు వచ్చినా, ఎంత సంపద వున్నా భర్తలేని లోటు తీర్చలేవుకదా! ఇదిలా ఉండగా అంతక్రితమే మా నాన్న చనిపోవడం వల్ల అమ్మకూడ ఒక విధంగా ఒంటరిదైనది. మా అన్నయ్య ఉన్నప్పటికి వదినతో పడక అమ్మ మా ఊరిలోనే ఒంటరిగా ఉండేది. ఉన్న ఎకరం పొలంలో వచ్చే ఆదాయానికి తోడు చిన్న, చిన్న పనులు చేసుకుంటు ఆమె బతుకు ఆమె బతికేది మా అన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ పట్నంలో ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో అమ్మను నా వద్దకు తీసుకొచ్చాను. ఆమెకు ఇప్పుడు 62 ఏళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆమె ఇంటి పనులు చూసుకుంటుంది. వ్యాపారం ప్రారంభించాను ఎకడ్రైనా మంచి స్థలం దొరికితే అడ్విన్సు ఇచ్చో లేక పూర్తి మొత్తం ఇచ్చి మారు బేరాలకు అమ్మేదాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం వల్ల క్రమంగా ఎదుగుతూ వచ్చాను అయితే ఎందుకో నాలో తెలియని దిగులు వెలితి గూడుకట్టు కున్నాయి. ఎంత చేసినా సాధించేది ఏమీ లేదన్న భావన కలుగు తోంది. గత ఆరు నెలల నుంచి నిద్రకూడా సరిగా పట్టడంలేదు. మానసిక ఒత్తిడి డిప్రెషన్‌కు గురవుతున్నాను. అప్పుడప్పుడు ఆత్మహత్యా భావాలు వస్తున్నాయి. దీని నుంచి బటయపడేమార్గం చెప్పండి.

  • భారతి, శ్రీకాకుళం.
    అమ్మా, మీరన్నట్టు, ఎంత సంపదవున్నా భర్తలేని లోటు తీర్చదు. ఒంటరి తనం మనిషిని వేధిస్తుంది అనడంలో సందేహం లేదు. హాయిగా అన్యోన్యంగా సాగుతున్న మీ జీవితం నుంచి ప్రమాదవశాత్తూ భర్త దూరమయ్యారు. చిన్న వయస్సులో భర్తను పోగొట్టుకున్న మహిళల మనోవేధన ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. అయితే ఆలోటును అంత సులభంగా పూడ్చలేము.
  • మీ భర్త చనిపోయే నాటికి మీ వయస్సు 36 సంవత్సరాలే కాబట్టి మీరు మరొక పెళ్లి చేసు కుని ఉండవచ్చు. అయితే బిడ్డ మీద ప్రేమ సమాజం ఏమనుకుంటుందో అన్న సంకోచం, వచ్చే వ్యక్తి ఎలాంటి వాడో, ఏమి చేస్తాడో
    అన్న భయం లాంటి అంశాలు మరో పెళ్లివైపు మనసునుపోనివ్వవు. మీరూ అలాగే ఆలోచించి ఉంటారని భావిస్తాను. అయితే ఆ ఒంటరి తనాన్ని మరచి పోవడానికి మీరు స్వంతంగా వ్యాపారం ప్రారంభించి ఉంటారు. జాగ్రత్త పరురాలు కాబట్టి అందులో మీ స్థాయికి
    తగ్గట్టు ఎదిగారు.
  • అయితే ప్రేమ, ఆదరణ, అనురాగల కోసం మీ మనసు అప్పుడప్పుడు తపించకమానదు. ఆ మానసిక తపనవల్ల ఒత్తిడి కలగడం సహజమే. కాగా 46 ఏళ్లు వచ్చిన మీలో హార్మోన్ల సమస్య తలెత్తి ఉంటుంది.
    అన్ని వెరసి మిమ్మల్ని డిప్రెషన్‌కు గురి చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆలోచనలు,
    జీవన శైలిని మార్చుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. మంచి అభిరుచి, ఒంటరి
    తనానికి ఔషధంలా పనిచేస్తుంది. చక్కని వ్యాపకాలు మానవసంబంధాలు ఒంటరి
    తనాన్ని మరిపిస్తాయి. రోజు మంచి అభి రుచులను ఆస్వాదించడం ప్రారంభించండి. చక్కని వ్యాయామం, సమతుల ఆహారం, సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి.
    మీ పాపను గొప్పదాన్ని చేయాలన్న లక్ష్యంతో పనిచేయండి. నిద్ర విశ్రాంతి
    పట్ల శ్రద్ద వహించండి. అవసరమైతే కౌన్సెలింగ్‌ తీసుకోండి.

డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,, సైకాలజిస్టు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/