మరికాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక

దేశంలో మొదటిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, బీజేపీ దీనిపై స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాపై అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. ఇండి కూటమి తరఫున కేరళ కు చెందిన ఎంపీ సురేష్‌ పోటీలో నిలిచారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. బీజేపీ-కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. . దీంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం ఎంపీలు తమలోని ఇద్దరు ఎంపీలను ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక చాలా సాధారణ మెజారిటీతో జరుగుతుంది. లోక్‌సభలో ఉన్న ఎంపీలలో సగానికి పైగా ఉన్న అభ్యర్థి లోక్‌సభ స్పీకర్ అవుతారు. అంటే ఎవరికి 50 శాతం ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. లోక్‌సభలోని 542 సీట్లలో, NDAకి 293 సీట్లు ఉన్నాయి. విపక్షాలకు సంఖ్యా బలం లేదు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఎన్డీయేకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఓం బిర్లా స్పీకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిర్లా గెలిస్తే రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన తొలి బీజేపీ నేత అవుతారు.